ఉన్నతమనస్కులు
అదుగో!
మనస్తత్వాల మకురులింకా అంటని మహామనీషులు
అదుగదుగో!
మనోశాస్తల మౌనశాసనాల జవదాటని
మహాఋషులు
ఇదుగో!
తమతమ తరతమ నరమానవ భేదాలెరుగని నిత్యమానసతృప్తులు
ఇదుగిదుగో!
వినయవిధేయతలే మోక్షమై, అన్యమెరుగని
విద్యాధ్యానతప్తులు
ఏ మారుమూలైనా అవకాశముంటే
మూల్యమేదైనా లక్ష్యపెట్టను!
ఏ లేశమాత్రమైనా అదృష్టముంటే
దూరమెంతైనా లక్ష్యపెట్టను!
వీళ్ళలో ఎవరైనా కూసింత జాలిపడి
అణకువను నేర్పుతామంటే
నిత్యవిద్యార్థినై నాకు నేర్చుకోవాలనుంది!
వీళ్ళలో ఎవరైనా ఊసేంత సిగ్గుపడి
ఇంగితాన్ని నేర్పుతామంటే
నిలువెత్తున నాలో చేర్చుకోవాలనుంది!
- రుద్ర✍🏾