ఏడడుగులు


Cover Image for ఏడడుగులు

ఇరుమనుషులు ఒక్కటిగా చేరిన
ఇరుమనసులను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'అభిమానము'

ఇరుభావాలు ఒక్కటిగా చేరిన
ఇరురాగాలను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'అనుబంధము'

ఇరుతలపులు ఒక్కటిగా చేరిన
ఇరుపలుకులను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'అనురాగము'

ఇరుపదములు ఒక్కటిగా చేరిన
ఇరుపథములను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'ఆదరము'

ఇరుచక్షువులు ఒక్కటిగా చేరిన
ఇరువీక్షణాలను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'ఆత్మీయత'

ఇరుచరితలు ఒక్కటిగా చేరిన
ఇరుభవితలను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'ఆప్యాయత'

ఇరుజననాలు ఒక్కటిగా చేరిన
ఇరుమరణాలను ఒక్కటిగా చేర్చిన
ఈ అడుగు
'ఆత్మబంధము'

ఇరువురు ఒక్కటిగా చేరిన
ఇరువురిని ఒక్కటిగా చేర్చిన
ఈ ఏడడుగులబంధం ముడివడి
నీ చేయీ నా చేయీ జతగూడి...

ఈ బంధుమిత్రులు ముక్కోటిదేవతలై
ఈ భువనగగనం స్వర్ణమండపమై
ఈ మేళతాళం మంగళవాద్యమై
ఈ మంత్రం మానసబంధమై
ఈ శుభలగ్నం సుముహూర్తమై
ఈ తలంబ్రాలు దివ్యపుష్పవర్షాలై
ఈ ప్రణయపరిణయం నిత్యబంధమై

సదా
సర్వదా
ఒకటిగ ఉందాం ఆజన్మాంతం!
ఒకటిగా ఉందాం ఆచంద్రార్కం!

- రుద్ర✍🏾

అభిప్రాయాలు :


    మరిన్ని ...

    మొత్తం - 112
    మరిన్ని...(101)