బ్రతకరా ఓ మనిషీ!
బ్రతకరా భానుడివై ఓ మనిషీ!
ఒక్క నవ్వుకే జగమంతా మెరిసేలా
గాయపడిన మురళిలో రాగమై నిండేలా
శ్వాసలో ఆశవై బ్రతకరా!
బ్రతకరా నెలఱేడై ఓ మనిషీ!
ఒక్క నవ్వుకే వనమంతా విరిసేలా
వేలకొలది రవళులలో గానమై పండేలా
ఆశలో బాసవై బ్రతకరా!
గాలంత అక్కఱని
పెనురెక్కలతో గెలవరా!
నేలంత ఇఱుకులో
నునువిత్తనమై మొలవరా!
నీ గుండెల గుడి ముందర
కుండపోతలెంతరా?
దండినదుల తడి పారగ
గుండెమంటలెంతరా?
నీ అణకువే నీ గురువై
నీ మెలకువే ఆదరువై
సంకల్పమే నీ బలమై
సంతోషమే కబళమై
బ్రతకరా! బ్రతకరా! బ్రతకరా!
కొమ్మకొమ్మలే నీ ఇళ్లై
పల్లవమై ఎదగరా!
కమ్మనైన కోయిలమ్మ
పల్లవిగా ఒదగరా!
నునువెచ్చని చేతలలో
జగమంతా విలసిల్లగ
నీ చల్లని చేతులలో
వనమంతా విరబూయగ
నీ ఎదకూ చిరునవ్వుకు
పూదేనెల బంధమై
నూరేళ్ళ కుసుమానికి
ఆనందమే గంధమై
బ్రతకరా! బ్రతకరా! బ్రతకరా!
- రుద్ర✍🏾