అంతర్యాత్ర


Cover Image for అంతర్యాత్ర

'నేను'
రెండక్షరాల పదం. ఇంతకుమునుపు, అన్యమనస్కంగా అప్రయత్నంగా లక్షలమార్లు ఉచ్చరించి ఉంటాను. నన్నే సంబోధించుకుంటున్నాననే నమ్మకంతో. ఎప్పుడూ, ఎటువంటి ప్రత్యేకతా ఆపాదించబడలేదు. కానీ, ఇప్పుడు 'నేను' అన్న సంబోధనకు, ఒకటికంటే ఎక్కువ స్వీయస్పందనలు వస్తున్నాయి. 'నేను' అన్న ప్రశ్నకు, ఒకటికంటే ఎక్కువ సమాధానాలు వినిపిస్తున్నాయి. 'నేను' అన్న శబ్దానికి, ఒకటికంటే ఎక్కువ ప్రతిస్వరాలు పురోగమిస్తున్నాయి. లోతట్టుల లోలోపలనుండి!

నాలో బ్రహ్మవిష్ణుమహేశ్వర సముచ్ఛయంగా నిలచిన మూడు సృష్టి-స్థితి-లయకారక జీవనపార్శ్వాలున్నాయి. ఒకదానిలో, నా అంతర్యాత్రకు బీజం పడింది. ఒకదానిలో, నా నిరంతరమైన నడకే నైజమని నిశ్చయమైంది. ఒకదానిలో, గమనమే గమ్యమనే సహజమైన శైలి నిర్ణయమైంది. నాలో నేను, 'శబ్దప్రపంచ సంచారి'నై దర్శనం గావించుకున్న నా ఆత్మలింగాన్ని, త్రికరణశుద్ధిగా ఇక్కడి నా మనోఫలకంలో ప్రతిబింబింపజేస్తున్నాను. ఆ జీవనపార్శ్వాలు...

********************

ఇంకా చదవండి ....

పాదముద్రలు

మొత్తం - 112
మరిన్ని...(102)